మూత్రపిండాల్లో రాళ్ళు సమస్య తగు నివారణ సూచనలు

 • మానవునికి ఒక జత మూత్రపిండాలు వీపు భాగంలో ఉంటూ శరీరంలో ఉన్న వ్యర్తపదార్థాలను రక్తం వడకట్తే ప్రక్రియలొ మూత్రం ద్వార బయటికు పంపుతుంది. ఈ విధంగా రోజుకు సగటుగా 2 నుండి 2.5 లీ|| మూత్రాన్ని తాయారు చేస్తుంది.
 • ఈ తయారీలో బాగంగా మన శరీరంలో వ్యర్తపధార్థాలు అనగా యూరిక్ యాసిడ్, OXALATES, సిస్టిన్స్  లాంటివి ఎక్కువగా ఉన్నప్పుడు అవి మూత్రపిండాలలో ఉండిపోయి క్రమేపి రాళ్ళుగామారి మనకు భాదని కలగజేస్తూ మూత్ర నాలాల్లో అడ్డుపడి మూత్ర ప్రయానానికి ఇబ్బందిని కలుగజేస్తూ తద్వారా మూత్రపిండ వాపుకు దారితీసి మూత్ర పిండం దెబ్బతినే విధంగా చేస్తాయి.

కారణాలు :  

 • ఇంతకు ముందు మీకు గాని, మీ కుటుంబ సబ్యులకు గాని ఎవరికైనా మూత్ర పిండాల్లో రాళ్ళూ వస్తే మళ్ళి రావడానికి అవకాశం ఉంటుంది.
 • నీరు తక్కువగా తీసుకున్న వారికి.
 • ప్రోటీన్ ఫుడ్, ఉప్పు, మాంసం, తీపి ఎక్కువగా తినే వారికి.
 • అధిక బరువు ఉన్న వారికి.
 • పొట్ట సంబంధిత ఆపరేషన్ చేయించుకున్నవారికి.
 • మూత్రపిండాల్లో సీస్ట్(cysts) ఉన్నవారికి.
 • దురలవాట్లు ఉన్నవారికి ఎక్కువగా రావటానికి అవకాశం ఉంటుంది.

లక్షణాలు:

మూత్రపిండాల్లో రాళ్ళు చిన్నచిన్నవి ఏర్పడినపుడు అవి ఎటువంటి లక్షణాలు లేకుండి మూత్రం ద్వార వెళ్ళిపోతాయి.కాని అవి పెద్దవి అయితే కొన్ని లక్షణాలు కనపడుతాయి.  

 • మూత్రం   వెళ్తున్నపుడు మంటగా, నొప్పిగా ఉంటుంది.
 • మూత్రంలొ రక్తం కనపడటం.
 • వెనుకనుండి నొప్పి మొదలై అది ముందుకు పోత్తుకడుపులోకి రావటం.
 • ఇకారంగా,వాంతులు అవ్వటం.

పరీక్షలు:

 • మూత్రాన్ని మైక్రోస్కోప్ పరీక్షలు చేసినపుడు రాళ్ళు కనపడతాయి.
 • రక్తంలో యూరిక్ ఆసిడ్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది.
 • X-Ray, Scanning లో రాళ్ళు కనపడతాయి.

ట్రీట్మెంట్:

పరీక్షలు చేసిన తర్వాత రాళ్ళ యొక్క పరిమంగాన్ని బట్టి వైద్యం ఉంటుంది. చిన్నచిన్న రాళ్ళైతే సులభంగా సిట్రేట్ అరుకులు, మందులు ద్వార, నీళ్ళు ఎక్కువగా తాగటం వాళ్ళ కరిగిపోతాయి.

పెద్దవి అయితే వివిధ రకాల శాస్త్ర చికిత్సల ద్వార వైద్యం చేస్తారు వాటిలో lithotripsy, ureteroscopy,nephrolithotomy లాంటివి ఉంటాయి.

కాని మూత్రపిండాల్లో రాళ్ళు ఎక్కువగా ఆయుర్వేద, ప్రకృతి వైద్యం ద్వారా కూడా కరుగుతాయి. మరి పెద్దవిగా ఉండి మూత్రని రానికి అడ్డుపడి ఇబ్బందిగ ఉంటే తప్ప మిగిలినవాటికి శస్త్రచికిత్సకు వెళ్ళే అంత అవసరం ఉండదని డాక్టర్లు అభిప్రాయం. అసలు మూత్రపిండాల్లో రాళ్ళు రాకుండా ఉండాలన్నా, వచ్చినవి తొందరగా కరగాలన్న క్రింది జాగ్రత్తలు, పద్ధతులు పాటిస్తే చాలు.

 1. నీళ్ళు: మానవుని శరీరంలో ఉన్న వేడి తగ్గాలన్న, మలినాలు బయటకు వెళ్ళాలన్న నీళ్ళు చాలా ముఖ్యం కనుక రోజుకు కనీసం 3 నుండి 4 లీ|| నీళ్ళు త్రాగాలి.ఎప్పుడైతే  మీ మూత్రం ముదురు పసుపు రంగులో ఉంటుందో అప్పుడు మీరు నీళ్ళు ఎక్కువ తాగాలని అర్థం.
 2. నిమ్మ నీరు: ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో నిమ్మచెక్క రసం కలిపి, కుదిరితే తేనె కలుపుకొని తాగాలి. దిని వాళ్ళ రక్తంలో మలినాలు తొలగుతాయి.
 3. తమలపాకు: తమలపాకు రోజుకు ఒకటి నమిలినట్టైతే రాళ్ళూ ఏర్పడకుండా ఉంటాయని పరిశోధనల్లో తెలుస్తుంది.
 4. తెలగపిండి ఆకు, వేళ్ళు: తెలగపిండి ఆకును వంటలొ కలిపి తినటం ద్వారా కూడా రాళ్ళూ కరుగుతాయి. వేళ్ళను నీటిలో వేసి మరిగించి నీళ్ళు తాగాలి.  
 5. నేల ఉసిరి: నేల ఉసిరి యెక్క గడ్డి జాతి మొక్క అది కనపడినప్పుడు రోజుకు చిన్న మొక్క ను తీసుకొని కడిగి ఆకులు, కాయలతో కలిపి తినచ్చు.
 6. తక్కువ మాంసహారం: వీలైనంత తక్కువగా మాంసం తీసుకోవడం, కాయకురాలు ఎక్కువగా తినడం వళ్ళ కూడా రక్తం మలినాలు తక్కువగా ఏర్పడుతాయి.
 7. కాయకురల్లో పాలకూర, బీట్రూట్, దుంపలు, సోయా బీన్స్ లాంటివి తక్కువగా తీసుకోవాలి, ఒకవేల రాళ్ళూ ఉన్నట్టు అయితే వీటికి దూరంగా ఉండాలి. మీరు తప్పక తీసుకున్నట్టు అయితే ఆరోజు నీళ్ళు ఎక్కువగా తాగడం మంచిది.
 8. బేకరీ ఫుడ్ తగ్గించాలి. మూత్ర పిండాల్లో రాళ్ళు ఉన్నట్టు అయితే మీరు ca+2 కాల్షియమ్ మాత్రలు వాడకూడదు. పాలు, పెరుగు తక్కువగా తీసుకోవాలి.
 9. డార్క్ చాక్లెట్ తినకూడదు.

పై విషయాలు అన్ని కూడా కొన్ని పరిశోధన పత్రాలు ద్వారా, డాక్టర్స్ ద్వారా తెలిసిన విషయాలు, మీకు రాళ్ళ సమస్య ఎక్కువగా ఉన్నపుడు తప్పకుండా డాక్టర్స్ అభిప్రాయం తీసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *