మనస్సు సుట్టురు గీత గీసి ఇది దాటోద్దు!!! అంటే ఆగుద్ద సీతే ఆగలేదు!! ఇంక మనసెక్కడ ఆగుద్రబాబు….!!!

మనం చాలా  మంది చిన్న పిల్లల్ని చూస్తుంటాం , నాన్నా ఇది చెయ్యకుడదురా! అంటే సరిగ్గా అదే పని చేస్తారు  అస్సలు వాళ్ళకి అలా  చెప్పకుండా ఉండి ఉంటే ఆపని చెయ్యొచ్చు చెయ్యకపోవచ్చు కాని మనం చెప్పటం మూలన వాళ్ళు అదే చేస్తారు  సరిగ్గా మన మనస్సు కూడా అంతే , ఎక్కువగా ఆంక్షలు పెట్టుకుని ముందుకు పోతుంటే మన మనస్సు మాత్రం అక్కడే చాకేర్లు కొడుతుంటుంది అది ఫుడ్ విషయం లో కావచ్చు లేదా ప్రేమ విషయంలో కావచ్చు  , బానిస అలవాట్లు ఇలా ఏదైనా సరే మనస్సు తీరు ఇంతే!! మన ఆదినంలోకి మనస్సుని తీసుకురావాలి అనుకోవటంలో తప్పు లేదు కాని మనస్సు మీద వొత్తిడి ఎక్కువ అయ్యే కొద్ది మనల్నే దాని ఆధీనంలోకి తీసుకేల్లిపోతుంది , అందుకే చాలా మంది ఈ విషయం లో ఎక్కువ బాధ పడుతుంటారు , సో మనస్సునీ వొత్తిడి కి గురి కానివ్వకుండా  వీలైనంత ఆహ్లాదకరంగా ఉంచటానికి ప్రయతించండి అదేనండి  చిన్న పిల్లకి తాయలం(చాక్లెట్) పెట్టి ఒక్క చోట కూర్చోపెడితే అది తినేవరుకు వాళ్ళకి వేరే ద్యాస ఎలా ఉండదో అలానే…. మనస్సు ద్యాస మార్చటమే!!!        

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *