నీకు లైఫ్ లో ఎప్పుడైనా నేను జీవితంలో ఎదగకుండా ఒక్కచోట ఉండిపోయా అని అనిపించిందా?
అదే చాలా ఏళ్ళ నుండి ఎదో అనుకున్న కాని ఇక్కడే ఉండిపోయా , చేయాలనుకున్నది చెయ్యలేపోతునా ఇలా!
అది సంపాదన విషయంలో కావచ్చు , నీ లక్ష్యం గురించి అయుండొచ్చు
అవును సరిగ్గా ఇక్కడ ఉండే ఆలోచించటం ప్రారంభించు మనీ అండ్ లైఫ్ థియరీ అంటే ఏంటో అవి రెండు ఎందుకు ఒక్క చోటే రాసానో అర్ధం అవ్వుతుంది. ఈ డబ్బుకి జీవితానికి మధ్య కనెక్షనే కాలం ,మనిషి బ్రతకాలంటే డబ్బు అవసరం ,ఆ డబ్బు ని అనుభవించాలంటే జీవితం అవసరం ఇక్కడ జీవితం అంటే చాలా పరిగిణం లోకి తీసుకోవాలి (నీ వయ్యసు ,నీ తల్లి తండ్రి ,నీ భార్య పిల్లలు ,లేదు నవ్ ఏకాకి ఐతే నీకు నిండా కలిగిన వాంఛలు ) కాలానికి అనుగుణంగా నీ సంపాదన నీ జీవితం రెండు సమపాళ్ళలో ఉండాలి తప్ప ఏది దేన్నీ శాసించే స్థితికి రాకూడదు